ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన మేనమామ.. చాక్లెట్ కొనిస్తానని చెప్పి దారుణం

by sudharani |   ( Updated:2023-11-11 09:44:26.0  )
ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన మేనమామ.. చాక్లెట్ కొనిస్తానని చెప్పి దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో చట్టాలు వస్తున్నప్పటికీ మహిళలపై జరిగే అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఆడది కనిపిస్తే చాలు వారి కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కామాంధులు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలకు, చిన్నారులకు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. అయినవాళ్లే నమ్మించి మరి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ సంఘటనే బిహార్‌లో జరిగింది. వరసకు మేనమామ అయ్యే యువకుడు చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఐదేళ్ల పాపని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సీతామర్షీ జిల్లా మేజర్‌గంజ్ బ్లాక్ ప్రాంతంలో ఓ ఐదేళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. దూరపు బంధువు, చిన్నారికి వరసకు మేనమామ అయ్యే యువకుడు ఇటీవల వాళ్ల ఇంటికి వచ్చాడు. ఆ యువకుడు చిన్నారిని మంచిగా ఆడిపించడం, కబుర్లు చెప్పడం లాంటివి చెయ్యడంతో అతడికి దగ్గరయ్యింది. ఇదంతా చూసిన తల్లిదండ్రులకు అతడిపై ఎలాంటి సందేహం కలగలేదు. దీంతో అంత అనుకూలంగా ఉందని భావించిన ఆ వ్యక్తి చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి బుధవారం ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. చాక్లెట్ కొనిచ్చిన అనంతరం పక్కనే ఉన్న చెరకు తోటలోకి తీసుకెళ్లాడు.

చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక చనిపోవడంతో ఆ ప్రాంతంలోనే గొయ్యి తీసి అక్కడే పాతిపెట్టేసాడు. ఇక ఏమి తెలియనట్లుగా ఇంటికి తిరిగి వెళ్లాడు. అయితే.. చిన్నారి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు యువకుడిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరుగా విలపించారు. గురువారం పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story