- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్పత్రి యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేసిన యూట్యూబర్లు అరెస్ట్
దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరానికి చెందిన ఓ ప్రముఖ ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు ప్రచురిస్తాం అని బెదిరించిన ఓ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు అయింది. సీఐ ఉదయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నగరానికి చెందిన ఓ ప్రముఖ ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కల్పిత వార్తను తయారు చేసి హాస్పిటల్ యాజమాన్యానికి చూపించి ప్రతి ఏడాది 5 లక్షల రూపాయలు యాడ్ రూపంలో చెల్లించకపోతే తమ యూట్యూబ్ ఛానల్ లో న్యూస్ అప్లోడ్ చేసి హాస్పిటల్ పేరు ప్రఖ్యాతలు దెబ్బతీస్తామని బెదిరించారు.
దాంతో హాస్పిటల్ యాజమాన్యం ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి యూట్యూబ్ ఛానల్ కు చెందిన సీఈఓ పుచ్చకాయలు ప్రకాష్, బ్యూరో చీఫ్ అత్తులూరి రామకృష్ణ అలియాస్ రాంకీ, అసిస్టెంట్ కెమెరామన్ ఎస్కే. బాబా అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.
- Tags
- arrest