జగిత్యాలలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

by Mahesh |
జగిత్యాలలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన బడుగు గంగాధర్, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కృపాకర్ వ్యక్తిగత పనుల నిమిత్తం జగిత్యాల వెళ్లారు. కొత్త బస్టాండ్ వద్ద వీరి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, కృపాకర్ 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. వీరిలో గంగాధర్ విద్యార్థి కాగా కృపాకర్ ప్లంబర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. యువకుల మృతితో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Next Story