చౌటుప్పల్ లో యువకుని ఆత్మహత్య..

by Sumithra |
చౌటుప్పల్ లో యువకుని ఆత్మహత్య..
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో శనివారం అనెమోని సాయిరాం (21) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనెమాని లింగస్వామి, సంతోషల రెండవ కుమారుడైన సాయిరాం ఇటీవల చదువు మానేసి జూలైగా తిరుగుతున్నాడు.

తల్లిదండ్రులు అతని సోదరుడి సూచన మేరకు కొద్ది రోజుల పాటు మండల పరిధిలోని ఓ కంపెనీలో పని చూసుకున్నాడు. ఈ మధ్య ఆ పని కూడా మానేయడంతో అతని సోదరుడు, తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన సాయిరాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన సాయిరాంను చూసి ఆయన సోదరుడు, తల్లిదండ్రుల రోదనలు విన్నంటాయి.

Advertisement

Next Story