మై బేబీ.. మై బొమ్మ.. ఐ మిస్ యూ: బర్త్ డే సందర్భంగా జాక్వెలిన్‌కు కన్మాన్ మెసేజ్

by Javid Pasha |
మై బేబీ.. మై బొమ్మ.. ఐ మిస్ యూ: బర్త్ డే సందర్భంగా జాక్వెలిన్‌కు కన్మాన్ మెసేజ్
X

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కన్మాన్ సుఖేష్ చంద్ర శేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ప్రేమ సందేశం పంపాడు. శనివారం కన్మాన్ జన్మదినం కావడంతో ఆమెపై తన అభిమానాన్ని వ్యక్తపరుస్తూ లేఖలో ప్రస్తావించాడు. మై బేబీ జాక్వెలిన్ అంటూ పేర్కొంటూ.. తనను మిస్ అవుతున్నట్లు తెలిపాడు. ‘మై బొమ్మ.. నా బర్త్ డే రోజున నిన్ను, నీ ఎనర్జీని నేను చాలా మిస్ అవుతున్నాను. నాకు మాటలు రావట్లేదు. నాపై నీకున్న ప్రేమ ఎప్పటికీ ముగిసిపోదు. దీనికి ఎలాంటి ఆధారాలు అవసరం లేదు బేబీ’ అని పేర్కొన్నాడు.

తన జీవితంలో వెలకట్టలేని అత్యుత్తమ బహుమతిగా జాక్వెలిన్‌ను వర్ణించాడు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని మరోవైపు ఖైదీల సంక్షేమానికి రూ.5.11 కోట్ల విరాళం ఇవ్వాలనుకుంటున్నట్లు తిహార్ జైలు అధికారులు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అధికారులు అంగీకరిస్తే ఇస్తానన్నాడు. గతంలోనూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖేష్ జాక్వెలిన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story