చెరువులోకి దూకి యువతి ఆత్మహత్య..

by Kalyani |
చెరువులోకి దూకి యువతి ఆత్మహత్య..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: మనస్థాపానికి గురైన ఓ యువతి కొండారెడ్డిపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని బాహార్ పేట్ వీధికి చెందిన బి. యశోద (18) కు పెళ్లి చేసేందుకు గాను కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తనకు అనారోగ్యంగా ఉందని యశోద వారించిన సయోధ్య కుదరలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై యశోద కొండారెడ్డిపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

చెరువులో యశోద శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నీటిలో నుంచి బయటికి తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

Next Story