నీ పిల్లలను నువ్వు తీసుకుపో.. నా బ్రతుకు నేను బతుకుతా

by Sumithra |
నీ పిల్లలను నువ్వు తీసుకుపో.. నా బ్రతుకు నేను బతుకుతా
X

దిశ, బడంగ్​పేట్ :​ నీ పిల్లలను నువ్వు తీసుకుపో.. నా బ్రతుకు నేను బతుకుతా అంటూ మాజీ భర్తకు ఫోన్​ చేసి ఓ ఇల్లాలు అదృశ్యమయిన ఘటన పహాడీషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. పహాడిషరీఫ్​ ఇన్​స్పెక్టర్​ కిరణ్ కుమార్​​ తెలిపిన వివరాల ప్రకారం ఎండీ రిజ్వానా బేగం కూతురు ఆఫ్రిన్​ బేగంతో పదేళ్ళ క్రితం అయూబ్​ గులామ్​తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తడంతో సంవత్సరం క్రితం పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.

పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తున్న ఆఫ్రిన్​ బేగంకు పిల్లల సంరక్షణార్థం అయూబ్​ గులామ్ భరణం చెల్లిస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన ఆఫ్రిన్​బేగం మాజీ భర్త అయూబ్​ గులామ్​కు ఫోన్​ చేసి నీ పిల్లలను నువ్వు తీసుకుపో.. నా బ్రతుకు నేను బతుకుతా అంటూ ఫోన్​ చేసి అదృశ్యమయ్యింది. అయూబ్​ గులామ్ ద్వారా సమాచారం అందుకున్న తల్లి రిజ్వాన్​ బేగం పహాడీషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed