- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chaitu Jonnalagadda: ఫేక్ హీరో కంటే రియల్ విలన్ బెటర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న జొన్నలగడ్డ
దిశ, సినిమా: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సోదరుడు చైతూ జొన్నలగడ్డ (Chaitu Jonnalagadda) గురించి తెలిసిందే. ‘బబుల్ గమ్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చైతు గతంలో #MM2 ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ (First Look) పోస్టర్‌తో పాటు.. టైటిల్ కూడా రివీల్ చేశారు మేకర్స్. చైతూ జొన్నలగడ్డ బర్త్‌డే సందర్భంగా నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘మోసెస్ మానిక్‌చంద్-2’ (Moses Manikchand Part-2) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
అలాగే.. ‘ఫేక్ హీరో కంటే రియల్ విలన్ బెటర్.. టౌన్‌లో కొత్త డాన్ మోసెస్ మానిక్‌చంద్‌ను మీట్ అవ్వండి’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌లో చైతూ జొన్నలగడ్డ ఓ సోఫాలో కూర్చుని ఉండగా.. మెడ నిండా బంగారు ఆభరణాలు, స్టైలిష్ గాగుల్స్ (Stylish Goggles) ధరించి బాస్ లుక్‌లో కనిపించి సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు. కాగా.. ఈ చిత్రానికి చైతూ జొన్నలగడ్డ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా.. రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
A 𝐑𝐄𝐀𝐋 𝐕𝐈𝐋𝐋𝐀𝐈𝐍 is better than a 𝐅𝐀𝐊𝐄 𝐇𝐄𝐑𝐎 😎🔥
— BA Raju's Team (@baraju_SuperHit) November 14, 2024
Meet the all-new DON in town – #MosesManikchand ❤️🔥❤️🔥#HappyBirthdayChaituJonnalagadda 🥳#ChaituJonnalgadda GIN & ASS #MosesManikchand in Part -2 #MM2 @vishwaprasadtg @peoplemediafcy #ChaituJonnalagadda… pic.twitter.com/Vnm1BW3gXv