- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..
దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శివారు 65 వ జాతీయ రహదారి పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బానోతు కౌసల్య (35) అనే మహిళ దుర్మరణం చెందారు. ఆమె భర్త రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చౌటుప్పల్ ఎస్ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్, కౌసల్య దంపతులు దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే రమేష్ తన భార్య కౌసల్యను లూనాపై ఎక్కించుకొని చౌటుప్పల్ నుంచి దండు మల్కాపురం వైపు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం దంపతులు వెళ్తున్న లూనాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కౌసల్య లూనా పై నుంచి జాతీయ రహదారి పై పడిపోవడంతో తలకు బలమైన గాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కౌసల్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై యాదగిరి తెలిపారు.