భవనంపై నుంచి దూకి మహిళ మృతి..

by Kalyani |
భవనంపై నుంచి దూకి మహిళ మృతి..
X

దిశ, శంకర్పల్లి : భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లిలోని రెడ్డి కాలనీలో జనార్దన్ రెడ్డి, లలిత దంపతులు. కొంత కాలంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కాగా శనివారం లలిత (35) భవనంపై నుంచి దూకడంతో తీవ్రగాయాలైనాయి.

ఇది గమనించిన లలిత భర్త జనార్దన్ రెడ్డి ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ లలిత మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story