ఫ్యాన్ కు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

by Kalyani |
ఫ్యాన్ కు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
X

దిశ, తలకొండపల్లి: ఫ్యాన్ కు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టిపలపల్లిలో అశ్విని తల్లి గారి ఇంట్లో శుక్రవారం సాయంత్రం అనారోగ్య సమస్యలతో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడిందని తలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం కేశంపేట మండల కేంద్రానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు.

మృతురాలు అశ్విని పెళ్లి కాకముందు క్షణిాకావేశంలో పురుగుల మందు తాగడం వల్ల అప్పట్లో ఆమె గొంతుకు సర్జరీ అయిందని, ఈ వేసవి కాలంలో ఎండ వేడిమికి గొంతు తరచుగా నొప్పికి గురి కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story