శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత.. మహిళ అరెస్ట్

by Kalyani |
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత.. మహిళ అరెస్ట్
X

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ నుంచి విదేశాలకు విదేశీ కరెన్సీ తరలిస్తూ సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం హైదరాబాద్ నుంచి (G9-459) విమానంలో షార్జా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయం వచ్చిన జీన్ అల్నేసా మొహమ్మద్ ఖమర్ ఆల్దీన్ అనే మహిళ ప్రయాణికురాలు శంషాబాద్ విమానాశ్రయంలోని డిపార్చర్ వద్ద సీఐఎస్ఎఫ్ అధికారులు మహిళ లగేజీని తనిఖీలు నిర్వహిస్తుండగా మహిళ హ్యాండ్ బ్యాగులో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు.

హ్యాండ్ బ్యాగ్ లో విదేశీ కరెన్సీ 44,480 యునైటెడ్ ఎమిరేట్స్ దినామ్స్ స్వాధీనం చేసుకున్నారు. మహిళ వద్ద స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ మొత్తం ఇండియా కరెన్సీలో 9 లక్షల 67 వేల 440 రూపాయల విలువ ఉంటుందని అంచనా వేశారు. విదేశీ కరెన్సీ తరలిస్తున్న మహిళను అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారులు మహిళపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement

Next Story