- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తీవ్రవిషాదాన్ని నింపిన కుటుంబ కలహాలు..
దిశ, భైంసా : భైంసా పట్టణ కేంద్రంలో ఆదివారం ఓ కుటుంబంలో కలహాలు తీరని విషాదాన్ని నింపాయి. పట్టణంలోని నర్సింహా నగర్ కు చెందిన ఈరేవార్ దీపా (22) అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త సాయి ట్రాన్స్ ఫార్మర్ కు ముట్టుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సాయి అనే యువకునికి గత ఏడాది దీప అనే యువతితో వివాహాం జరిగింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి గోడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా ఇంట్లో గోడవలు జరుగగా.. క్షణికావేశానికి లోనైన దీప ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది.
భార్య ఆత్మహత్య చేసుకుందని మనస్థాపం చెందిన సాయి కుభీర్ క్రాస్ రోడ్డులో గల ట్రాన్స్ ఫార్మర్ కు ముట్టుకొని తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికులు గమనించి హుటాహుటిన స్థానిక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. దీప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు.