- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తపై భార్య హత్యాయత్నం
ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించి భర్తపై డిజిల్ పోసి నిప్పటించిన వైనం
దిశ, గుమ్మడిదల : వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని, భర్త నిద్రిస్తున్న సమయంలో అతడిపై భార్య డీజిల్ పోసి నిప్పంటించిన ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సుంకు నర్సింహులు (32) దుండిగల్ గ్రామానికి చెందిన యాదమ్మతో గత 17 ఏళ్ల క్రితం వివాహమైంది.
వారికి ముగురు మగ పిల్లలు సంతానం. యాదమ్మ వేరే వ్యక్తులతో వివాహేతర బంధం పెట్టుకొని ప్రతిరోజూ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లేదని నర్సింహులు తెలిపారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకుండా ఉండేదన్నారు. ఇదే విషయంపై 27న శనివారం రాత్రి తొమ్మది గంటల సమయంలో భర్త నర్సింహులులు భార్య యాదమ్మను తన పద్ధతి మార్చుకోవాలిన ప్రవర్తన మార్చుకోవాలని పరస్పరం వాగ్వాదానికి దిగారు. దీంతో తన భర్తను ఎలాగైనా అడ్డు తప్పించుకోవానే పథకంతోనే యాదమ్మ ఇంటి ఎదుట ఆగి ఉన్న ఆటోలో నుంచి ప్లాస్టిక్ బాటిల్ ద్వారా డీజిల్ తీసి మంచి నిద్రలో ఉన్న భర్త నర్సింహులు ఒంటిపై పోసి నిప్పట్టించింది.
దీంతో నరసింహులు గట్టిగా అరువగా చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు వచ్చి మంటలను ఆర్పి 108 అంబులెన్స్ లో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి తరలించినట్లు వారు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. యాదమ్మను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భర్త నర్సింహులు తమ్ముడు పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జిన్నారం ఎస్సై విజయ్ రావు దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు.