- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సినీనటులే కాదు.. ఎవరినీ వదిలిపెట్టం.. వెస్ట్‌జోన్ డీసీపీ హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్(West Zone DCP Vijay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన సినీనటులు, టీవీ యాంకర్లపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు. ఎవరెవరు ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. నటీనటుల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చూసి బెట్టింగ్ ఆడిన వారి వివరాలు సేకరిస్తున్నాం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరిని పిలిచి విచారిస్తాం.. సినీనటులు, యాంకర్లు అవసరమైన వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, ఇప్పటివరకు విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పలువురిపై పలు సెక్షన్లతో పాటు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా.. పోలీస్ యూనిఫాం ధరించి బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ రాజు గౌడ్‌పైనా కేసు నమోదు చేయగా.. మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని.. ఆమెపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read More..
చిన్నోళ్ళు సరే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హీరో, హీరోయిన్స్‌పై కేసులు పెట్టరా? నెటిజన్స్
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసున్న తెలుగు హీరో కూతురు.. కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు?