వోల్వో బస్సు బోల్తా పలువురికి గాయాలు..

by Hamsa |   ( Updated:2022-12-09 06:08:51.0  )
వోల్వో బస్సు బోల్తా పలువురికి గాయాలు..
X

దిశ, కొత్తకోట: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ సమీపంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో44 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వెళ్లున్న ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వగా.. మిగతా వారంతా సురక్షితంగా ఉన్నారు. తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న సమయంలో బస్సు ఘటనను చూస్తుండగానే ఓ కారును మరో డీసీఎం, లారీ డీకొట్టాయి. ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టడంతో కారులోని మరో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed