- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇరువర్గాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. ఓ మత పెద్ద గురించి అనుచిత పోస్టు చేశారంటూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులతో సహా 8 మంది గాయపడ్డారు. దీంతో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144 నిబంధనలను విధించారు. ఈ ఘటన శనివారం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై అకోలా పోలీసు సూపరింటెండెంట్ సందీప్ ఘుగే మాట్లాడుతూ.. గంగాధర్ చౌక్, పోలా చౌక్, హరిహర్ పేట్ ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని చెప్పారు.
హింసను అదుపు చేయడానికి వెంటనే చర్యలు చేపట్టామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, దుండగులు పరిస్థితిని హింసాత్మకంగా మార్చారని తెలిపారు. పోలీసు వ్యాన్‌ను ధ్వంసం చేశారని, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయని, దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించామని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై రామ్‌దాస్ పేట పోలీస్ స్టేషన్‌లోనూ, హింసాత్మక ఘర్షణలపై ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్‌లోనూ కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. అకోలా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి అదనపు బలగాలను రప్పించామని అన్నారు. ఈ సంఘటనలతో సంబంధం ఉందనే ఆరోపణలపై 26 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
Maharashtra | A violent clash erupted between two groups over a minor dispute in the Old City police station area of Akola on Saturday
— ANI (@ANI) May 14, 2023
"Violent clash erupted between two groups over a minor dispute. Some Vehicles have been damaged by the violent mob. The situation is now under… pic.twitter.com/1UXEkEEAjZ