మైనర్ బాలిక పై అఘాయిత్యం..

by Sumithra |
మైనర్ బాలిక పై అఘాయిత్యం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ముక్కుపచ్చలారని 10 సంవత్సరాల బాలిక పై పదహారేళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన పదహారేళ్ల మైనర్ ఈ నెల 14న సాయంత్రం పెళ్లిబరాత్ జరుగుతుండగా నిర్మాణుస్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడికట్టాడు. బాలిక కేకలు వేసినా డిజె సౌండ్ లో నోరు నొక్కి పట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

బాలిక తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లగా తల్లితో పాటు ఉన్న బాలిక పై ఈ అఘాయిత్యం జరగడంతో బాలిక తల్లికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం పై గురువారం గ్రామంలో పంచాయతీ నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఐసీడీఎస్ అధికారులు, రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లారు. దానితో పంచాయతీ పెద్దలందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలుని పై కేసునమోదు చేసి జువైనల్ హోమ్ కు తరలించినట్లు సమాచారం.

Advertisement

Next Story