శోకసంద్రంలో బరంగ్ ఎడ్గి గ్రామం.. అనారోగ్యంతో గ్రామ సర్పంచ్ మృతి..

by Sumithra |
శోకసంద్రంలో బరంగ్ ఎడ్గి గ్రామం.. అనారోగ్యంతో గ్రామ సర్పంచ్ మృతి..
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండలంలోని బరంగ్ ఎడ్గి గ్రామం మంగళవారం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామస్తులంతా విషన్నవదనంలో ఉన్నారు. తను సర్పంచ్ నని, ఎన్నడు కూడా గర్వం చూపించకుండా ఇంటికి, గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రతీఒక్కరిని ఆప్యాయతగా పలకరించే తమ గ్రామప్రథమ పౌరురాలు పసుపుల లక్ష్మి ఇక లేరని తెలిసి గ్రామమంతా ఇదేం ఘోరం జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకోవడమే కనబడింది.

రెండు నెలల క్రితం అనారోగ్యం బారిన పడిన ఆమె సోమవారం వరకు చికిత్స పొందుతున్నారని, యధావిధిగా గ్రామానికి ఆరోగ్యంగా తిరిగి వస్తారని అనుకున్న గ్రామస్తుల ఆశలు గళ్ళంతయ్యాయి. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం ఆమె పార్దివ దేహానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నివాళులను అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష్మిమరణం తీరనిలోటు అని, అతి చిన్న వయసులో ఆమె మరణించడం బాధాకరమన్నారు. అయన వెంట మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, నాయకులు, అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed