ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య..

by Aamani |
ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య..
X

దిశ,ఎల్కతుర్తి: విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వీరనారాయణపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. లొకిని కుమారస్వామి, సరిత దంపతులకు ముగ్గురు పిల్లలు. ఒక కూతురు, ఇద్దరు మగ పిల్లలు కవలలు. పెద్ద కుమారుడు లొకిని రాము(15) జమ్మికుంటలో ఎస్టీ ప్రభుత్వ వసతి గృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం మూడు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed