- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బావిలో నుండి గుర్తు తెలియని శవం వెలికితీత..
దిశ చేగుంట: కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాన్ని బావిలో నుంచి ఆదివారం ఉదయం వెలికి తీశారు. మండల పరిధిలోని వడియారం గ్రామ శివారులో గల పాడుబడ్డ బావిలో శనివారం రాత్రి గుర్తు తెలియని శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది. శనివారం రాత్రి చీకటి కావడంతో ఆదివారం ఉదయం శవాన్ని వెలికి తీసే కార్యక్రమాన్ని చేపట్టారు.
సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి బావిలో పడి చనిపోయి ఉన్నాడని అతనికి సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తన సిబ్బందితో కలిసి బావిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని బయటకు తీయించి భద్రపరిచారు. చేగుంట చిన్న శంకరంపేట మండలాలకు సంబంధించిన కంపెనీలలో పనిచేసే ఇతర రాష్ట్రాల చెందిన వ్యక్తి లేక ఇటీవల ఎవరైనా తప్పిపోయారని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుడికి సంబంధించిన ఎవరైనా ఆచూకీ తెలిసిన వారు ఉంటే చేగుంట పోలీసులను సంప్రదించాలని ఎస్సై ప్రకాష్ గౌడ్ సూచించారు. ఈ మేరకు మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ రూమ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.