- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్ బాలురపై అఘాయిత్యాలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లోని వేర్వేరు చోట్ల ఇద్దరు మైనర్ బాలురపై అఘాయిత్యం జరిపారు కామాంధులు. వివరాలు ఇలా ఉన్నాయి. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జీ.లక్ష్మి తన ఇద్దరు కొడుకులతో నివాసముంటోంది. ఇళ్లల్లో పని చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఇదిలా ఉండగా తాను అద్దెకు ఉంటున్న ఇళ్లు బీటలు వారటంతో కొత్త ఇంటి కోసం వెతుకుతోంది. గురువారం రాత్రి ఇలాగే ఇద్దరు కొడుకులతో కలిసి అద్దె ఇంటికోసం వెతికి వస్తుండగా ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న దిలీప్ (21) 7వ తరగతి చదువుతున్న లక్ష్మి చిన్న కొడుకును పిలిచాడు. ఎందుకో అనుకున్న లక్ష్మి చిన్న కొడుకును దిలీప్ వద్దకు పంపి వెంటనే తిరిగి వచ్చెయ్యమంది.
అయితే, గంట గడిచినా కొడుకు రాకపోవటంతో ఆమె దిలీప్ ఇంటికి వెళ్లింది. కొడుకు గురించి అడుగుతుండగానే దిలీప్ ఇంటి టెర్రస్ పైనుంచి బాలుడు కిందకు వచ్చాడు. ఏం జరిగిందని ప్రశ్నించగా తనపై దిలీప్ అఘాయిత్యానికి పాల్పడినట్టు చెప్పాడు. ఈ మేరకు లక్ష్మి ఫిర్యాదు చెయ్యగా మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నమాజ్ కోసం వెళుతుండగా..
ఇక మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమాజ్ చెయ్యటానికి వెళుతున్న 9 సంవత్సరాల బాలునిపై మరో కామాంధుడు అఘాయిత్యం జరిపాడు. ఇంటికి సమీపంలో ఉన్న మసీదుకు వెళుతున్న బాలున్ని కత్తి చూపి బెదిరించి ఓవైసిహిల్స్ ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన సర్వర్ (22) అనే యువకుడు ఈ దారుణనికి ఒడిగట్టాడు. దీనిపై ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి మైలార్ దేవులపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.