- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FLASH: వైశాలి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్
దిశ, వెబ్డెస్క్: వైశాలి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. గత అక్టోబర్ నెలలోనే వైశాలి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నవీన్ రెడ్డి వెల్లడించారు. అంతేగాక, వైశాలి తన లవర్ కాదని, తన భార్య అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. గత ఏడాది ఆగస్టులోనే బాపట్లలో వివాహం జరిగినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భయపడి ఈ ఏడాది జులై నెల నుంచి వైశాలి వారితోనే ఉంటుందని, వైశాలి తల్లిదండ్రులతో నాకు ప్రాణహాని ఉందని నవీన్ వెల్లడించారు. 'నా భార్యను నా వద్దకు పంపించడం లేదని సెప్టెంబర్ 30న లీగల్ నోటీసు పంపాను. రెండు సంవత్సరాలుగా మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం నన్ను చంపేందుకు వైశాలి తల్లిదండ్రులు వేరే వారికి సుపారి ఇచ్చారు. మా పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు వైశాలి తల్లిదండ్రులు ధ్వంసం చేశారు. వైశాలి సోదరుడు విదేశాల్లో ఉంటూ ఒక ఎన్ఆర్ఐ సంబంధం తీసుకొచ్చాడు. అప్పటినుంచి నన్ను చంపేందుకు యత్నిస్తున్నారు.' అని నవీన్ రెడ్డి వెల్లడించారు.
మరోపక్క ఈ కేసుపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి అనే కిడ్నాపర్తో పాటు ఇప్పటివరకు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్న పోలీసులు.. మరింత మంది నేరస్తులు ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేస్తామని మహేశ్ భగవత్ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు. కిడ్నాప్ అయిన ఆరు గంటల్లోనే బాధితురాలిని రక్షించామని అన్నారు. ప్రస్తుతం నిందితులంతా తమ అదుపులోనే ఉన్నారని స్పష్టం చేశారు. నిందితుల నేర చరిత్రపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అందరిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read....