Tragedy: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థి బలవన్మరణం

by Shiva |
Tragedy: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: హస్టల్ భవనం పైనుంచి దూకి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా (Srikakulam)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్ధి ప్రవీణ్ నాయక్ (Praveen Nayak) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్థరాత్రి సమయంలో హాస్టల్ భవనం మూడో అంతస్తు పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు తీవ్ర గాయలైన ప్రవీణ్ నాయక్‌ను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో అతడి పరిస్థితి విషమించి ప్రవీణ్ నాయక్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడు ప్రకాశం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story