- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.2కోట్లతో టికెట్.. టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన ఐదుగురు దుర్మరణం
దిశ, వెబ్‌డెస్క్: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన ఐదుగురు మృతి చెందినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. అయితే వీరంతా టైటానిక్ శకలాలను చూసేందుకు ఏకంగా 250వేల డాలర్లు(సుమారు రూ.2కోట్లు) వెచ్చించి ఒక్కో టికెట్ కొన్నట్లు తెలిసింది. టైటాన్ అనే మినీ (సబ్‌మెర్సిబుల్) లో టైటానిక్ శిథిలాలను చూసేందుకు సముద్ర గర్భంలోకి ఐదుగురు వెళ్లారు. దాదాపు ఐదు రోజులుగా వారి జాడ దొరకకపోవడంతో ఏం జరిగి ఉంటుందో అని అంతా టెన్షన్ పడ్డారు.
అమెరికా తీర రక్షణ దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీంలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. చివరకు సబ్ మెర్సిబుల్ శకలాలు గుర్తించడంతో పాటు ఐదుగురు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్ లాండ్ నుంచి ఐదుగురితో కూడిన టైటాన్ సాహసయాత్ర ప్రారంభం అయింది. పోలార్ ప్రిన్స్ నౌక సాయంతో టైటాన్ ను నీటి అడుగు భాగానికి పంపారు. గంటన్నర తర్వాత పోలార్ ప్రిన్స్ తో టైటాన్ కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే ఓషన్ గేట్ అనే యాత్ర నిర్వహణ సంస్థ అమెరికా కోస్ట్ గార్డ్‌కు తెలిపింది.
వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ సముద్ర గర్భంలో వేట ప్రారంభించారు. సాహస యాత్రకు వెళ్లిన ఐదుగురు చనిపోయినట్లు తాజాగా కోస్ట్ గార్డ్ సిబ్బంది మృతుల కుటుంబాలకు సమాచారం చేరవేశారు. అమెరికా కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మోగర్ మాట్లాడుతూ.. ఐదుగురి మృతదేహాలను కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. టైటాన్ ప్రమాదానికి పేలుడు కారణం కావొచ్చని యూఎస్ కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. నీటి అడుగులోకి వెళ్లే క్రమంలో ఒత్తిడి వల్లే మినీ సబ్ మెర్సిబుల్ పేలి పోయ ఉంటుందన అధికారులు తెలిపారు.