వారం వ్యవధిలో మూడు హత్యలు.. సైకో కిల్లర్ అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-11 05:40:11.0  )
వారం వ్యవధిలో మూడు హత్యలు.. సైకో కిల్లర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా నరసరావు పేటలో వారం వ్యవధిలో మూడు మర్డర్స్ తీవ్ర కలకలం రేపాయి. ఈ కేసులో సైకో కిల్లర్ అంకమ్మరావును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. గడిచిన వారంలో అంకమ్మరావు ముగ్గురిని చంపడం ఏపీలో సంచలనం రేపింది. అయితే నిందితుడు చంపిన వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లా నారాయణ పురానికి చెందిన సంపత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మూడు వరుస హత్యల నేపథ్యంలో నరసరావుపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుడు అంకమ్మరావును అరెస్ట్ చేశారు. నిందితుడు అర్థరాత్రి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తంచారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంకమ్మరావుపై గతంలో 13 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. చిల్లర డబ్బుల కోసం హత్య చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పేపర్లు ఏరుకునే వాడిలా నటిస్తూ అంకమ్మరావు మర్డర్లకు పాల్పడ్డాడు. రూ.30, 120, రూ.500 కోసం ముగ్గురిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఓ వృద్ధురాలిని రాయితో మోది రెండు లక్షలు చోరీ చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story