చిట్యాలలో దొంగల బీభత్సం..

by Sumithra |
చిట్యాలలో దొంగల బీభత్సం..
X

దిశ, చిట్యాల : చిట్యాల పట్టణ కేంద్రంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బీభత్సాన్ని సృష్టించారు. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మున్సిపల్ కేంద్రంలోని వేణుగోపాల స్వామి వెంచర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి గంజి రామ్మూర్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యాపారం నిమిత్తం రామ్మూర్తి బయటకు వెళ్లాల్సి వస్తుండడంతో ఇంట్లో భార్య ఒక్కతే ఉండేది. గురువారం ఉదయం తన భార్యతో కలిసి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి సూర్యాపేటకు వెళ్లారు.

అనంతరం సాయంకాలం తిరిగివచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత బీరువాను చూడగా అందులోని నగదు, బంగారం కనిపించకపోవడంతో ఒక్కసారిగా లబోదిబోమన్నారు. బీరువాలో 50 తులాల బంగారం, 8 లక్షల రూపాయల నగదు భద్రపరచగా దుండగులు వాటిని దోచుకెళ్ళారని తెలిపారు. వెంటనే ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వడంతో సీఐ శివరాం రెడ్డి, ఎస్సై రవిలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Advertisement

Next Story