- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ఆ పని చేస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష..!
దిశ, వెబ్ డెస్క్: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై కొందరు దుండగులు రాళ్లు రువ్వుతున్న ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఇక నుంచి ఎవరైనా వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడికి దిగితే కఠిన చర్యలుంటాయని వారు హెచ్చరించారు. భారత రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం.. రైళ్లపై రాళ్ల దాడికి దిగిన వ్యక్తులకు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు. కాగా 2019లో వందే భారత్ రైళ్లను దేశంలో ప్రవేశపెట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సేవలు ఈ ఏడాది జనవరిలో మొదలయ్యాయి. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ఖాజీపేట, ఖమ్మం, భువనగిరి, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ రైలుపై దుండగులు రాళ్లు విసిరారు.
ఇక దేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్, చత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు చోట్ల వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు ఆగంతకులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను అలెర్ట్ చేస్తూనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ తెలిపారు. గ్రామాల వద్ద ఉన్న రైల్వే ట్రాక్ ల రక్షణ కోసం సర్పంచ్ లను విలేజ్ మిత్రగా ప్రకటించి తగు అవగాహన కల్పించామని చెప్పారు. రైల్వే సంపద ప్రతి ఒక్కరిదని.. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందని ఆయన తెలిపారు.