హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. 3 బస్సులు అగ్నికి ఆహుతి

by Satheesh |   ( Updated:2023-02-13 02:25:44.0  )
హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. 3 బస్సులు అగ్నికి ఆహుతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో చోటు చేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాద ఘటనలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌లోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన మురవక ముందే.. తాజాగా నగరంలో మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పార్కింగ్‌ స్థలంలో ఉన్న 3 బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి.

మంటలు భారీగా ఎగసిపడటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..

Advertisement

Next Story