ఆర్టీసీ బస్టాండ్ లో చోరీ

by Sridhar Babu |
ఆర్టీసీ బస్టాండ్ లో చోరీ
X

దిశ, కరీంనగర్ : ఆర్టీసీ బస్టాండ్ లో బస్ ఎక్కుతున్న మహిళ బ్యాగులో నుంచి ఆరు తులాల బంగారం, మూడు వేల రూపాయల నగదును కొట్టేశారు. హైదరాబాద్ కు చెందిన వేల్పుల మమత ధర్మారం మండలం కొత్తూర్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు తన పిల్లలు, సోదరితో కలిసి కరీంనగర్ బస్టాండ్ కు చేరుకుంది. బస్టాండ్ లో జనం రద్దీగా ఉండటంతో తన సోదరి ముందుగా బస్ ఎక్కి సీటు ఆపగా లగేజ్ ని బస్ లోకి అందించిన మమత పిల్లలతో కలిసి బస్ ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగ్ లో నుంచి బంగారు నగలు, మూడువేల రూపాయలను కోట్జేశారు. బస్ ఎక్కి సీట్లో కూర్చొని బ్యాగ్ చూసుకోగా దాని జిప్​ తీసి ఉండటంతో అనుమానం వచ్చి లోపల పరిశీలించగా అందులో బంగారం, నగదు కనిపించలేదు. దాంతో పోలీస్ లను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story