పట్టపగలే దొంగల బీభత్సం

by Shiva |
పట్టపగలే దొంగల బీభత్సం
X

రెండు తులాల బంగారం, రూ.25 వేల నగదు అపహరణ

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని కోటార్ మూర్ మునిసిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో బుధవారం మాజీ వార్డ్ మెంబర్ తీగల లక్ష్మీలింబగౌడ్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో రెండు తులాల బంగారు నగలను, రూ.25 వేల నగదుతో దొంగలు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే.. తీగల లక్ష్మీలింబగౌడ్ సిద్దిపేటలోని వారి మామ ఇంటి వద్ద ఓ సమస్య గురించి చర్చించేందుకు ఐదు రోజుల కిందట వారి కుమార్తెతో కలిసి వెళ్లారు. ఇంటి వద్ద వారి కుమారుడు నవతేజ్ గౌడ్ ఒక్కడే ఉన్నాడు.

ఈ క్రమంలో గురువారం మిట్ట మధ్యాహ్నం స్నేహితులను కలిసేందుకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు నవతేజ్ గౌడ్. సరిగ్గా గంటలోపే ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. అదేవిధంగా బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, రూ.25 వేల నగదును దొంగలు ఎత్తికెళ్లినట్లు నవతేజ్ గౌడ్ తెలిపాడు. చోరీ జరిగిన విషయం సిద్దిపేటలో ఉన్న వారి తల్లిదండ్రులు తీగల లక్ష్మి, లింబగౌడ్, ఇంటి పక్కనే ఉన్న తీగల నరేందర్ గౌడ్ కు నవతేజ్ గౌడ్ సమాచారం అందజేసి విలపించాడు.

Advertisement

Next Story