- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిదండ్రులను చెరువులో తోసేసిన కొడుకు.. కారణం అదే..
దిశ, కామారెడ్డి రూరల్ : తాగుడుకు బానిసైన ఓ కొడుకు తాగుడుకు డబ్బులు ఇవ్వడం లేదని కన్న తల్లిదండ్రులనే కడతేర్చేందుకు యత్నించాడు. ఈ ప్రయత్నంలో తండ్రి మృతి చెందగా తల్లి మాత్రం స్పృహ కోల్పోయి బతికి బయట పడింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కామారెడ్డి పోలీసుల కథనం ప్రకారం విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న రేష్మాబేగం, మహ్మద్ సలీమ్ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఖలీమ్ ఉన్నారు. కూతుర్లకు పెళ్లిలు కాగా అత్తవారింటి వద్ద ఉంటున్నారు. ఖలీం మాత్రం ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతని భార్య సైతం విడాకులు ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను త్రాగుడుకు డబ్బులు ఇవ్వాలని నిత్యం ఖలీం వేదించేవాడు. ఇటీవల దుబాయి వెళ్తానంటూ, అందుకోసం డబ్బులు కావాలని వేధించేవాడు. మా దగ్గర డబ్బులు లేవు, వారం రోజుల తర్వాత ఇస్తామని తల్లిదండ్రులు ఖలీంకు తెలిపారు. అయినా వినకుండా తనను ఎందుకు కన్నారంటూ నిత్యం కొడుతుండేవాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం సైతం డబ్బుల కోసం ఇంట్లో గొడవ పడి తల్లిదండ్రులను వెంట తీసుకుని మనం ముగ్గురం నీటిలో పడి ఆత్మహత్య చేసుకుందామని కామారెడ్డి పెద్దచెరువు వద్దకు వారిని తీసుకెళ్లాడు. చెరువులోకి ముగ్గురు దిగగా ఖలీం తల్లి దండ్రులను తోసివేయడంతో తండ్రి మహ్మద్ సలీం (55) మృతి చెందగా, తల్లి రేష్మబేగం పడిన ప్రాంతంలో లోతు ఎక్కువగా లేకపోవడంతో నీటిలో పడి స్పృహ కోల్పోయింది. ఖలీం మళ్లీ తల్లి రేష్మను బయటకు తీస్తుండగా విషయం తెలుసుకున్న ఆమె అల్లుడు ఆటోలో వచ్చి రేష్మబేగం, సలీంలను ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే సలీం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రేషబేగం మాత్రం ప్రాణాలతో బయటపడిందని, కొడుకు ఖలీం బాగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రేష్మబేగం ఇచ్చిన పిర్యాదు ఆధారం గా కొడుకు ఖలీంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ హెచ్ వో నరేష్ తెలిపారు.