- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఎంక్వైరీ సీబీఐకి.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ లో రైల్వే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించిందని, దీనిపై ఉన్నత కమిటీతో లోతుగా విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక అంతకుముందు సిగ్నలింగ్ సిస్టంలో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. కాగా ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో మొత్తం 288 మంది మృతి చెందగా 1000 మంది వరకు గాయపడ్డారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
Advertisement
Next Story