Adibatla Vaishali Kidnap Case Updates.. ఇంకా పోలీసులకు చిక్కని నవీన్ రెడ్డి..?

by Satheesh |   ( Updated:2022-12-12 13:59:39.0  )
Adibatla Vaishali Kidnap Case Updates.. ఇంకా పోలీసులకు చిక్కని నవీన్ రెడ్డి..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు నవీన్ వైశాలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కారును పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో ఉన్న నవీన్ రెడ్డి కారు జాడను పోలీసులు తాజాగా కనుగొన్నారు. కారు వదిలి పారిపోయిన నిందితుడు నవీన్ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నవీన్ ఓయో హోటల్లో బస చేసి.. బెజవాడ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తు్న్నారు. కాగా, 2019లోనే నవీన్ రెడ్డిపై రోడ్డు యాక్సిడెంట్ కేసు ఫైల్ అయ్యిందని.. చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

అయితే, ఈ కిడ్నాప్ కేసులో వైశాలిని రక్షించిన రోజే నిందితుడు నవీన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అతడితో పాటు అతడి ప్రధాన అనుచురులను అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ, నిజానికి మాత్రం పోలీసులు ఇంకా నవీన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు.. అతడు ఇంకా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పటి నుండి పోలీసులు నవీన్ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తూనే ఉన్నారు. ఇక, ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు నవీన్ రెడ్డి నుండి పోలీసులు వైశాలిని కాపాడిన పోలీసులు.. తాజాగా వైశాలిని కిడ్నాప్ చేసిన కారును గుర్తించారు. కానీ నవీన్ రెడ్డి మాత్రం పోలీసులకు చిక్కకుండా అప్పటి నుండి అండర్ గ్రౌండ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

READ MORE

ముక్కోటి మహోత్సవ ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్

Advertisement

Next Story