- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ఆ మృతదేహం మైనర్ బాలికదే..
దిశ, శంషాబాద్ : శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డుపక్కన లభించిన మహిళ మృతదేహాన్ని మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంకి చెందిన దంపతులు తన కూతురుతో కలిసి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్ళ గూడాలో ఉంటూ లేబర్ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. తమ (16) సంవత్సరాల కూతురు శంషాబాద్ లోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల క్రితం పనికివెళ్లిన మైనర్ బాలిక ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేశారు. శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ పక్కన అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులు మృతురాలు తమకూతురుగా గుర్తించారు. తమ కూతురును అన్యాయంగా అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారని అన్నారు. నిందితులను పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో పరిస్థితిని ఉద్రిక్తతంగా మారింది.