ఆ కులం వారిని ప్రేమించారని కన్న బిడ్డల్నే హతమార్చిన తల్లిదండ్రులు..

by Anjali |   ( Updated:2023-04-16 08:58:14.0  )
ఆ కులం వారిని ప్రేమించారని కన్న బిడ్డల్నే హతమార్చిన తల్లిదండ్రులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో యువతి, యువకులు ప్రేమలో పడడం కామన్ అయిపోయింది. అయితే కొంతమందికి ఓకే కులానికి చెందిన వారితో పరిచయాలు ఏర్పడగా.. మరికొంతమందికి ఇతర కులాల వారితో పరిచయాలు ఏర్పడతాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు వాళ్లను కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తారు. మరికొందరు నచ్చచెప్పి వారి దారిలోకి తెచ్చుకుంటారు. కానీ కొందరు పరువు కోసం చంపడానికైనా వెనకడరు.

అయితే ఇలాంటి ఘటనే బిహార్‌లోని హాజీపూర్‌లో చోటు చేసుకుంది. కూమార్తెలిద్దరు ఇతర కులాలకు చెందిన వారిని లవ్ చేస్తున్నారని.. కోపాద్రికులైన తల్లి(రింకూదేవి), తండ్రి (నరేష్ భటియాలు) ఇద్దరు కలిసి పరువు కోసం కన్న బిడ్డలు అని చూడకుండా, వాళ్లు నిద్రిస్తున్న సమయంలో కిరాతకంగా హత్య చేశారు. హత్య చేశాక మృతదేహాల పక్కన తల్లి ఉండగా, తండ్రి పరారయ్యాడు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story