డాక్టర్‌పై కన్నేసిన నర్స్.. అత్యాచారం చేసి ఆపై న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తూ..

by Hamsa |   ( Updated:2023-03-02 15:18:22.0  )
డాక్టర్‌పై కన్నేసిన నర్స్.. అత్యాచారం చేసి ఆపై న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తూ..
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో దారుణం జరిగింది. ఓ మహిళ డాక్టర్‌పై కన్నేసిన మేల్ నర్స్ ఆమెను అత్యాచారం చేశాడు. ఆపై ఆమె న్యూడ్ ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళకు చెందిన ఓ మహిళా వైద్యురాలుగా విధులు నిర్వహిస్తుంది. ఆమె వద్దనే నిషామ్ బాబు అనే వ్యక్తి మేల్ నర్స్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్‌పై కన్నేశాడు మేల్ నర్స్. అయితే ఆమెకు వేరే దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వేరే హోటల్ గదికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆ సమయంలో ఆమె న్యూడ్ ఫొటోలను కూడా తీశాడు.

ఆ తర్వాత నుంచి ఆ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అలా బెదిరిస్తూ మహిళ డాక్టర్‌ను అనేక మార్లు అత్యాచారం చేశాడు. ఇక అతడి నుంచి తప్పించుకునేందుకు నిషామ్ బాబు నెంబర్‌ను బ్లాక్ చేసింది సదురు డాక్టర్. దీంతో ఆమె న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది గమనించిన లేడి డాక్టర్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిషామ్ బాబుని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

ప్రమోషన్ కోసం బాస్‌కు గిఫ్ట్‌గా భార్య..? మరిది కూడా తక్కువోడేం కాదు..!

Advertisement

Next Story