పెళ్లి మీదకు మళ్లిన మనసు.. వెయిటింగ్ భరించలేక యువకుడు ఆత్మహత్య

by Anjali |
పెళ్లి మీదకు మళ్లిన మనసు.. వెయిటింగ్ భరించలేక యువకుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగుల్చుతున్నారు. ఇంట్లో మందలించారని.. అడిగింది కొనివ్వలేదని ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యల వరకు వెళ్తుతున్నారు. తాజాగా ఖమ్మంలో జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చేసుకుంది. పెళ్లి కావడం లేదని మనస్థాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలం పాతకారాయిగూడకు చెందిన పాశం రామయ్య(25) అనే యువకుడికి గత కొంత కాలం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే, ఎన్ని సంబంధాలు ఎన్ని చూసిన సెట్ కావడం లేదని తీవ్ర మనస్థాపనికి గురైన రామయ్య గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో రామయ్య మృతి చెందాడు. చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story