- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మటన్ కర్రీ తక్కువ పెట్టారని పోలీసులనే చితకబాదిన వ్యక్తి..
దిశ, వెబ్‌డెస్క్: జైల్లో ఉండే కొంతమంది నిందుతులు వింతగా, కృూరంగా ప్రవర్తిస్తుంటారు. వారికి నచ్చింది చేయకపోయిన, అడిగింది పెట్టకపోయినా ఇతర ఖైదీలపై లేదా జైలర్లపై దాడులకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే కేరళలో జరిగింది. మటన్ తక్కువ పెట్టారని ఓ నిందితుడి జైలర్‌పై దాడికి దిగాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలోని పూజప్పురా జైలులో ఫైజాస్ అనే వ్యక్తి డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు జైలులో తనకు తక్కువ మటన్ కర్రీ పెట్టారంటూ జైలర్లపైనే దాడి చేశాడు. దీంతో అతనిపై మరో కేసు పెట్టిన పోలీసులు.. స్పెషల్ వార్డుకు తరలించారు. ‘అతడికి పెట్టిన దానికంటే మరింత మటన్ కర్రీ పెట్టాలని రచ్చ చేశాడు. కర్రీని తీసుకెళ్లి చెత్తబుట్టలో వేశాడు. అనంతరం డిప్యూటీ సూపరింటెండ్ంతో పాటు సీనియర్ జైలు అధికారులపై దాడి చేశాడని’’ పోలీసులు తెలిపారు.