- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పతాగి హోటల్ సిబ్బందిపై దాడి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
దిశ, వెబ్ డెస్క్: తప్పతాగి హోటల్ సిబ్బందిపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దాడి చేసిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అజ్మర్ అథారిటీ కమిషనర్ గిరీధర్, గంగాపూర్ సిటీ స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన ఐపీఎస్ ఆఫీసర్ సుశీల్ కుమార్ బిష్ణోయ్ తన సిబ్బందితో కలిసి జైపూర్-అజ్మర్ హైవేలోని ఓ రెస్టారెంట్ లో పోస్టింగ్ వచ్చిన సందర్భంగా పార్టీ చేసుకున్నారు. అనంతరం వారు హోటల్ ముందున్న వాష్ రూమ్ లోకి వెళ్తున్న సమయంలో హోటల్ కు చెందిన ఓ సిబ్బంది షర్ట్ లేకుండా కనిపించడంతో అలా షర్ట్ లేకుంగా ఎందుకు తిరుగుతున్నావంటూ ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ అతడిపై చేయి చేసుకున్నాడు.
దీంతో హోటల్ సిబ్బంది పోలీస్ అధికారి తీరుపై నిరసిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన సదరు ఐపీఎస్ అధికారి వెంటనే పోలీస్ సిబ్బందితో వచ్చి వాళ్లను చితకబాదాడు. ఈ దృశ్యాలన్ని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. రెస్టారెంట్ ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. కాగా తనపై వచ్చన అరోపణలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు. విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో కేసు విచారణ సాగుతోందని రాజస్థాన్ డీజీపీ ఉమేశ్ మిర్శా తెలిపారు.