భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే?

by GSrikanth |
భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో రాంబాబు అనే వ్యక్తి భార్య దేవమణిని(35) రోకలిబండతో దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రాంబాబు అక్కడినుంచి పారిపోయారు. స్థానికులను విషయం అడగ్గా.. వాళ్లిద్దరి మధ్య గతకొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని చెప్పినట్లు సమాచారం. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవమణి మృతదేహాన్ని ఖమ్మం మర్చురీకి తరలించారు. దేవమణి ఖమ్మం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed