పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు కటకటాల్లోకి..

by Shiva |   ( Updated:2023-05-22 09:17:36.0  )
పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు కటకటాల్లోకి..
X

ముగ్గురమ్మాయిలతో ప్రేమాయణం

సమయానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మాజీ ప్రియురాలు

దిశ ప్రతినిధి, బిచ్కుంద : కామారెడ్డి జిల్లాలో సోమవారం పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. కటకటాల పాలయ్యాడు. పెళ్లి పత్రికలు ముద్రించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన అబ్బయి తనను పెళ్లి చేసుకుంటానని వంచించి మోసం చేశాడని మరో యువతి ఫిర్యాదు చేయడంతో బిచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మోగ గ్రామానికి చెందిన మారుతికి సోమవారం వివాహం జరగాల్సి ఉంది.

బిచ్కుంద మండలం లోని ఒక గ్రామానికి చెందిన యువతి తనను ప్రేమ పేరుతో లొంగదీసుకుని శారీరకంగా వాడుకున్నాడని, తనను పెళ్లి చేసుకోకుండా మరో యువతి మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ.. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మారుతిని అదుపులోకి తీసుకొని విచారించి అతడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. మారుతి ఒక మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ అని సమాచారం. గతంలోనూ ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపాడని ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story