- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్రంపై పెళ్లి మండపానికి వెళుతున్న వరుడు.. చితక్కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లిళ్లు జరుగుతున్నప్పుడు వరుడు గుర్రాల మీద వస్తుంటారు. అది చాలా కామెన్. ఈ క్రమంలోనే ఓ వరుడు పెళ్లి మండపానికి గుర్రంపై వెళుతున్నాడు. అతడి వెంట బంధువులు కూడా ఉన్నారు. అయితే.. దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో కొంత మంది అగ్రకులస్తులు వరుడుపై దాడి చేశారు. తక్కువ కులానికి చెందిన వాడవు నువ్వు గుర్రంపై వస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆగ్రా నగరంలోని సదన్ బజార్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయ్ కుమార్ అనే వ్యక్తి అతడి పెళ్లి నిమిత్తం గుర్రంపై పెళ్లిమండపానికి బయలుదేరాడు. అతడితో పాటు కొంత మంది బంధువులు కూడా ఉన్నారు. అయితే ఆ వరుడు దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో కొంత మంది ఆగ్రకులాస్తులు అతడిపై దాడి చేశారు. ‘‘మా ఊరిలో దళిత పెళ్లికొడుకులు గుర్రాలు ఎక్కరు, నీకు ఎంత ధైర్యం?’’ అంటా వరుడుపై దాడి చేశారు. అంతే కాకుండా మహిళలతో అసభ్యకంగా ప్రవర్తించారు.
వరుడితో పాటు అతడి బంధువులపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అయితే ఈ సంఘటన మే-4 జరగగా.. వరుడు అత్త గీతాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళ్యాణ మండపంలోకి ప్రవేశించినప్పుడు దాదాపుగా వారిపై 20 నుంచి 25 మంది దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా.. ఈ దాడి చేసిన అగ్ర కులానికి చెందిన వారిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.