ఎంసెట్ పరీక్షా కేంద్రం వద్ద శిశువుకు జన్మినిచ్చి అక్కడే వదిలేసి వెళ్లిన బాలిక

by Hamsa |
ఎంసెట్ పరీక్షా కేంద్రం వద్ద శిశువుకు జన్మినిచ్చి అక్కడే వదిలేసి వెళ్లిన బాలిక
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెనుమలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంసెట్ పరీక్ష జరుగుతుండగా ఓ బాలిక ఓ శిశువుకు జన్మినిచ్చి అక్కడే ఎండలో వదిలేసి వెళ్లిన సంఘటన కలకలం సృష్టించింది. ఎండ వేడిని తట్టుకోలేక చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను గుర్తించి పట్టుకున్నారు. అలా ఎందుకు చేశావని ఆమెను ప్రశ్నించగా తనకేమీ తెలియదంటూ సమాధానమిచ్చింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తేమి కాదు. కొంత మంది క్రూరంగా ప్రవర్తిస్తూ పసి వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు.

Advertisement

Next Story