క్షణికావేశంలో బాలిక బలవన్మరణం

by Shiva |
క్షణికావేశంలో బాలిక బలవన్మరణం
X

దిశ, కొమురవెల్లి : క్షణికావేశంలో ఓ బాలిక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కొమురవెల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన పోట్లచెరువు మల్లేశం కూతురు సంధ్య (14) తెలిసీ తెలియని వయసులో ఇంట్లో ఉన్న తన తమ్ముడు మహేష్ తో గొడవ పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్య క్షణికావేశంలో ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం సంధ్య స్థానిక కే.జీ.బీ.వీ పాఠశాలలో ఎనమిదో తరగతి చదువుతూ ఉత్తీర్ణురాలైంది. ఇదిలా ఉండగా చిన్న వయసులోనే ఆవేశంతో ఆత్మహత్యకు పాల్పడిన సంధ్య మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు, తోటి స్నేహితులు బోరున విలపించారు. మృతురాలి తండ్రి మల్లేశం తన కూతురి మృతిపై ఎవరిపై అనుమానం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్సై చంద్రమోహన్ దర్యాప్తు చేస్తున్నారు. కొమురవెల్లి గ్రామ సర్పంచ్ భర్త, సామాజిక వేత్త సార్ల కిష్టయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు.

Advertisement

Next Story