మంటలు చెలరేగి కారు దగ్ధం.. ఎండల తీవ్రత వల్లే మంటలు

by Kalyani |
మంటలు చెలరేగి కారు దగ్ధం.. ఎండల తీవ్రత వల్లే మంటలు
X

దిశ, గద్వాల: గద్వాల పట్టణం భీమ్ నగర్ లో ఓ హోటల్ వద్ద నిలిచి ఉన్న కారులో గురువారం ఆకస్మిక మంటలు చెలరేగి దగ్ధం అయింది. కర్నూల్ జిల్లా డోన్ కు చెందిన అమాన్ ఉల్లా ఖాన్ అనే వ్యక్తి పనుల నిమిత్తం గద్వాలకు వచ్చి భోజనం కోసం హోటల్ కు వెళ్లారు.

భోజనం చేసుకుని కారు వద్దకు వెళ్లగా అప్పటికే పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించాడు. చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు ఆర్పే లోపు కారు పూర్తిగా కాలిపోయింది. ఎండ తీవ్రత వల్లనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Advertisement

Next Story