- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రైవర్ నిర్లక్ష్యం.. చెట్టును ఢీ కొట్టిన స్కూల్ బస్సు
దిశ, కీసర : డ్రైవర్ నిర్లక్ష్యం.. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం ఉదయం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కుందన్పల్లి వద్ద చోటుచేసుకుంది. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోని చీర్యాలకు చెందిన డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకొని కుందన్పల్లి నుంచి చీర్యాలకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెట్టును ఢీకొని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులలో కొంత మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ప్రమాదానికి గురి కావడంతో విద్యార్థులు భయాందోళనకు గురి అయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సును అతి వేగంగా నడపడంతో చెట్టును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసం అయిందని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.