- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమానాస్పద స్థితిలో యువకుని మృతి..
దిశ, అక్కన్నపేట : ఊరికి దూరంగా ఉన్న గుట్టల్లో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్కన్నపేట మండలంలో కలకలం రేపింది. మృతిని తండ్రి మాలోతు రాజు తెలిపిన వివరాల ప్రకారం అక్కన్నపేట మండలంలోని మల్చేరువ్ చెరువు తండ గ్రామపంచాయతీ పరిధిలోని, నర్సింగ్ తాండలో బుధవారం తమ కులస్తుల పెళ్లి జరగగా ఆ పెళ్లికి మాలోతు ఆంజనేయులు (17) హాజరయ్యాడని తెలిపారు. పెళ్లి తంతు ముగిసిన అనంతరం భోజనం చేస్తున్న ముగ్గురు వ్యక్తులు భయపెట్టారని చెప్పారు. బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో పెళ్లి భరత్ కి వెళ్లిన ఆంజనేయులు తిరిగి ఇంటికి రాకపోవడంతో గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ కనిపించలేదని తెలిపారు.
ఎక్కడా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం ఉదయం 6:30 గంటల సమయంలో డ్యాం కట్ట దగ్గర వెళ్లగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడని తెలిపారు. మాలోతు రాజు , మలోతు కిషన్ కుటుంబ సభ్యులకు కొద్ది రోజుల నుండి భూమి గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో నెల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని, ఈ గొడవలు దృష్టిలో పెట్టుకొని, అతని కుటుంబ సభ్యులు తన కొడుకును ఏదైనా చేసి ఉంటారా, లేక ఆత్మహత్య చేసుకుని ఉంటారా అనే అనుమానంతో మాలోతు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఒక ప్రకటనలో తెలియజేశారు.