- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టపగలే చోరీలు.. ఇద్దరి అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పట్టపగలే చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ క్రైం టీం సిబ్బంది శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి లక్షా 42వేల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కిషన్ బాగ్ నజమ్‌నగర్ ప్రాంత వాస్తవ్యుడైన ఠాకూర్ ఉదయ్‌సింగ్(23) అత్తాపూర్‌లోని వినాయక క్లాత్‌స్టోర్‌లో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ షోయబ్ అహమద్(20)తో అతనికి స్నేహం ఉంది. కాగా, కిషన్‌బాగ్‌లోని ఓ ప్రైవేట్స్కూల్నుంచి 10వ తరగతి పూర్తి చేసిన ఉదయ్‌సింగ్ ఆ తరువాత దుర్వ్యసనాలకు బానిసగా మారాడు. ఈ క్రమంలో చెడు సావాసాలు కూడా చేశాడు. 2021లో సహచరులతో కలిసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ nపరిధిలోని ఓ ఇంట్లో దొంగతనం చేయటంతోపాటు ఇంట్లోని మహిళపై అత్యాచారం జరిపాడు.
ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి కొంతకాలానికి విడుదలయ్యాడు. అయితే, ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదు. స్నేహితుడు షోయబ్‌తో కలిసి ఇటీవలే బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఓ ఇంట్లోకి పట్టపగలే చొరబడి లక్షా 42వేల రూపాల విలువ చేసే బంగారాన్ని తస్కరించాడు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ క్రైం టీం సిబ్బంది శనివారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఫలక్‌నుమా ఏసీపీ సుధాకర్పర్యవేక్షణలో బహదూర్‌పురా సీఐ అనిల్‌కుమార్, డీఐ శ్రీశైలం, డీఎస్ఐ శ్రీకాంత్నిందితులను అరెస్టు చేయటంలో కీలకపాత్ర వహించారు.