షూ లేస్‌తో ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్య

by Jakkula Mamatha |   ( Updated:2024-12-24 09:02:28.0  )
షూ లేస్‌తో ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా చూడొద్దు అని మందలించినందుకు ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలుడు షూ లేస్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు తల్లిదండ్రులకు విడాకులు కావడంతో అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో వాళ్ళ తాత, అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్, హర్రర్ వీడియోలు చూస్తుంటాడు. ఇంట్లో వాళ్ళు ఫోన్ వాడొద్దు అని మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి తాతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story